అక్రమంగా తరలించడానికి సిద్ధంగా ఉంచిన 50 లక్షల విలువైన 81
ఎర్ర చందనం దుంగలు ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం డివిజన్ పరిధిలో గంగవరం మండలం పాత రామవరంలో ఓ రైతు పొలంలో తరలించడానికి సిద్ధంగా ఉంచిన దుంగలను పక్కా సమాచారంతో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని సూదికొండ రేంజ్ కార్యాలయానికి తరలించారు.
