పోటీ పరీక్షలు సిద్ధపడే అభ్యర్థులు పట్టుదలతో అన్ని విధాల సన్నద్ధం కావాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ అన్నారు. జగంపేట నియోజకవర్గం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టెట్, డీఎస్సీ ఉచిత కోచింగ్ సెంటర్ అభ్యర్థులకు ఎంతో ఉపయో గకరమన్నారు. నిరుద్యోగుల కోసం జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా టెట్, డీఎస్సీ పరీక్షలకు ఉచిత కోచింగ్ సెంటర్ ను ఏర్పాటు చేశా మన్నారు. జగ్గంపేట నియోజకవర్గంలో 4 మండలాల అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.