రాజకీయ స్వార్ధ ప్రయోజనాల కోసం వర్గీకరణ పేరుతో కేంద్రం దళితుల మధ్య చిచ్చు పెడుతుందని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా దళిత ఐక్యవేదిక ప్రజా సంఘాలు ఆరోపించాయి. సుప్రీం కోర్టు తీర్పు రాజ్యాంగ విరుద్ధంగా ఉందని స్పష్టం చేశాయి. ఈదరపల్లి దళిత ఐక్యవేదిక కన్వీనర్ జంగా బాబురావు ఇంటి వద్ద దళిత ప్రజా సంఘాలు నాయకులు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశాయి. అనంతరం సుప్రీంకోర్టు తీర్పు వ్యతిరేకిస్తూ దళిత ప్రజా సంఘాలు జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. త్వరలో దీనిపై ఉద్యమం చేపడతామని ఈసందర్భంగా వారు వెల్లడించారు.
