పిఠాపురం నియోజకవర్గం అంటే పవన్ కళ్యాణ్‌కు ఎంతో ఇష్టమని, ఎప్పుడు తనతో మాట్లాడిన పిఠాపురంలో ఏం చేస్తే అభివృద్ధి చెందుతుందో చెప్పాలని అంటుంటారని ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన పిడుగు హరిప్రసాద్ అన్నారు. సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి పిఠాపురం వచ్చిన ఆయనకు అభిమానులు స్వాగతం పలికారు. తాను ఎమ్మెల్సీగా పిఠాపురం నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానని, త్వరలో దీనిపై పూర్తి వివరాలు వెల్లడిస్తానన్నారు.
