కాకినాడ జిల్లా గండేపల్లి జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఎన్ హెచ్ 16 జాతీయ రహదారిపై జగ్గంపేట నుంచి రాజమండ్రి వైపు బైక్ పై వెళుతున్న నలుగురుని గండేపల్లి వద్ద మురారి వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ప్రమాదానికి గురయ్యారు..
ఈ ప్రమాదంలో బైక్ పై వెళుతున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి.
వీరిలో ఇద్దరు పెద్దవారు కాగా, ఒక బాలుడున్నాడు.మరో మహిళకు తీవ్ర గాయాలు కావడంతో, రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి పోలీసులు తరలించారు..సమాచారం అందుకున్న జగ్గంపేట సిఐ లక్ష్మణరావు, ఎస్సై రామకృష్ణ హైవే పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. చెందిన వారిది పశ్చిమగోదావరి జిల్లా భీమవరంగా చెబుతున్నారు.