ఆంధ్రప్రదేశ్ హత్యలకు నిలయంగా మారిందని చెబుతున్న జగన్మోహన్ రెడ్డి ఈ హత్యలకు మూలకారకుడని ఆయనను ఎందుకు అరెస్ట్ చేయకూడదని హోం మంత్రి అనిత ప్రశ్నించారు. మంగళగిరిలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో విష సంస్కృతికి బీజం పోసింది జగన్మోహన్ రెడ్డేనని గుర్తు చేశారు. టిడిపి అధికారం చేపట్టాక నాలుగు హత్యలు జరిగితే అందులో చనిపోయిన ముగ్గురు, టీడీపీ కార్యకర్తలేనన్నారు.
