కోనసీమ జిల్లాలోని అంబాజీపేట మండలం ఇసుకపూడి గ్రామానికి చెందిన సరెళ్ళ వీరేంద్ర కుమార్ తండ్రి, సత్తి రాజు ఒక ఏజెంట్ను నమ్మి ఖతర్ దేశంలో వంట పని కోసం వెళ్లి అక్కడ నరకయాతన అనుభవి స్తున్నాడు. సౌదీ అరేబియాలో ఒంటెల దగ్గర కాపరిగా నియమించా రని..అక్కడ ఎండ దాటికి తను చనిపోయేలా ఉన్నానని ఒక సెల్ఫీ వీడియో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ ఆదేశాల మేరకు కొత్తపేట రెవిన్యూ డివిజనల్ అధికారి సత్యనారాయణ ఇసుక పూడిలోని బాధితుని ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు.. ఎట్టి పరిస్థితుల్లోనూ బాధితున్ని ఇండియన్ ఎంబసీ ద్వారా స్వదేశానికి తీసుకొస్తామని వారి తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు.