గుంటూరు జిల్లా నరసరావుపేట వద్ద వాసవి కాంప్లెక్స్ ఎదుట విజిలెన్స్ అధికారుల మెరుపు దాడి చేసి రూ. 1 కోటి 15 లక్షల 20 వేల విలువైన సిగరెట్ల లారీని పట్టుకున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి ఎలాంటి బిల్లులు లేకుండా సిగరెట్లను అక్రమంగా తరలిస్తున్నట్లు విజిలెన్స్ సీఐ చంద్రశేఖర్ వెల్లడించారు. ప్రభుత్వానికి పన్నులు చెల్లించకుండా అక్రమంగా విక్రయిస్తున్నట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు.








