మెగాస్టార్ చిరంజీవి, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఓ భారీ సినిమా రాబోతుందనే వార్త ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటివరకు ఈ ఇద్దరి కలయికలో ఒక్క సినిమా కూడా రాకపోవడంతో మెగా అభిమానులు ఈ కాంబో కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా వీరిద్దరి మధ్య ఓ ప్రాజెక్ట్‌కు సంబంధించి చర్చలు జరుగుతున్నాయనే వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ఇటీవల త్రివిక్రమ్ మెగాస్టార్ చిరంజీవిని కలిసి ఓ ఆసక్తికరమైన కథను వినిపించారట. ఆ కథ చిరంజీవికి బాగా నచ్చడంతో పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేయాలని త్రివిక్రమ్‌కు సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక ఈ క్రేజీ కాంబినేషన్‌ను సెట్ చేసేందుకు ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య ప్రయత్నిస్తున్నారని, డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది.
గతంలో చిరంజీవి నటించిన ‘జై చిరంజీవ’ సినిమాకు త్రివిక్రమ్ కథ, మాటలు అందించారు. అయితే ఇప్పటివరకు ఆయన దర్శకత్వంలో మెగాస్టార్ ఒక్క సినిమా కూడా చేయలేదు. మరోవైపు పవన్ కల్యాణ్, అల్లు అర్జున్ వంటి మెగా హీరోలతో త్రివిక్రమ్ సూపర్ హిట్ చిత్రాలను అందించారు. దీంతో చిరంజీవిని తనదైన శైలిలో త్రివిక్రమ్ ఎలా చూపిస్తారో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ప్రస్తుతం త్రివిక్రమ్ ఎన్టీఆర్‌తో తెరకెక్కించనున్న భారీ మైథలాజికల్ ప్రాజెక్ట్‌పై ఫోకస్ పెట్టారు. ‘గాడ్ ఆఫ్ వార్’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా రూపొందనుందని ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, నిర్మాత రాధాకృష్ణతో కలిసి త్రివిక్రమ్ కనిపించిన ఫొటో కూడా ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలను పెంచేసింది.
ఇక చిరంజీవి విషయానికి వస్తే.. ప్రస్తుతం తన తదుపరి సినిమా ‘కాకా’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారు. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయిన తర్వాతే చిరంజీవి, త్రివిక్రమ్ సినిమా ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
మరి ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న మెగాస్టార్, మాటల మాంత్రికుడి కాంబినేషన్ నిజంగానే సెట్ అవుతుందా? ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి. ప్రస్తుతం మాత్రం ఈ వార్త మెగా అభిమానుల్లో భారీ ఆసక్తిని పెంచుతోంది.








