నందమూరి మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై ప్రస్తుతం టాలీవుడ్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఈ సినిమాకు ‘బింబిసార’ ఫేమ్ దర్శకుడు వశిష్ఠ దర్శకత్వం వహించబోతున్నారనే వార్త ఇప్పటికే నందమూరి అభిమానుల్లో భారీ అంచనాలను పెంచింది. అంతేకాదు, ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ కూడా కీలక పాత్రలో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం దర్శకుడు వశిష్ఠ ఈ సినిమా స్క్రిప్ట్‌కు సంబంధించిన ఫైనల్ డ్రాఫ్ట్ పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం, వచ్చే ఏడాది జనవరి చివరి నుంచి సినిమా షూటింగ్‌ను ప్రారంభించేలా ప్లాన్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.
ఇక ఈ సినిమాను భారీ సోషియో ఫాంటసీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మల్టిపుల్ టైమ్‌లైన్స్, పునర్జన్మలు, భారీ విజువల్ ఎఫెక్ట్స్ వంటి ఆసక్తికరమైన అంశాలు ఇందులో ఉండబోతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. మోక్షజ్ఞను రొటీన్ మాస్ కథతో కాకుండా, ఒక కొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకులకు పరిచయం చేయాలనే ఉద్దేశంతోనే వశిష్ఠను ఎంపిక చేసినట్లు టాక్.
మొత్తానికి నందమూరి వారసుడి తొలి సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. అయితే ఈ ప్రచారంలో ఎంతవరకు నిజముందనేది తెలియాలంటే సినిమా నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే. ముఖ్యంగా ఫస్ట్ లుక్ లేదా టీజర్ విడుదలైతే ఈ సినిమా ఎలా ఉండబోతుందనే దానిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.








