Search
Close this search box.

  స్పిరిట్ కోసం భారీ సెట్..? ప్రభాస్ కోసం భారీ యాక్షన్ సెటప్.!

November 8, 2026 8:12 AM | Aditya369 News

స్పిరిట్ కోసం భారీ సెట్..? ప్రభాస్ కోసం భారీ యాక్షన్ సెటప్.!

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘స్పిరిట్’. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొనగా, ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. యాక్షన్, ఎమోషన్, వైలెన్స్ కలగలిపి సందీప్ రెడ్డి వంగా తనదైన స్టైల్‌లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ అప్‌డేట్ వినిపిస్తోంది. రాబోయే షెడ్యూల్‌లో ప్రభాస్‌తో పాటు వివేక్ ఒబెరాయ్, ప్రకాష్ రాజ్‌లపై కీలకమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం మేకర్స్ భారీ స్థాయిలో ప్రత్యేకమైన సెట్‌ను నిర్మిస్తున్నారట.

మరోవైపు ఈ సినిమాలో ప్రభాస్ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ చాలా ప్రత్యేకంగా ఉండబోతుందని సమాచారం. ఈ ఎపిసోడ్‌లో ప్రభాస్ పూర్తిగా వైల్డ్ అండ్ మాస్ అవతార్‌లో కనిపించనున్నాడట. ఇక త్రిప్తి డిమ్రి ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది.

టి-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. అంతేకాదు, ‘స్పిరిట్’ ప్రధాన కథాంశం కూడా చాలా కొత్తగా ఉండబోతుందని తెలుస్తోంది. మొత్తానికి సందీప్ రెడ్డి వంగా మరోసారి తనదైన టేకింగ్‌తో ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమాపై అంచనాలు మాత్రం రోజురోజుకూ పెరిగిపోతున్నాయి.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు