మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కాల్సిన భారీ ప్రాజెక్ట్ ‘గాడ్ ఆఫ్ వార్’ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. అసలు ఈ సినిమా పట్టాలెక్కుతుందా? లేక ప్రస్తుతానికి పక్కన పెట్టేస్తారా? అనే చర్చ అభిమానుల్లో జోరుగా సాగుతోంది.
దాదాపు రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందించాలనే ప్లాన్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఓటీటీ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి, త్రివిక్రమ్ గత చిత్రం ‘ఆదర్శ కుటుంబం’ ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోకపోవడం ఈ ప్రాజెక్ట్‌పై ప్రభావం చూపుతున్నాయని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
మరోవైపు ఈ చిత్రాన్ని నిర్మించనున్న హారిక అండ్ హాసిని క్రియేషన్స్ కూడా ఇంత భారీ బడ్జెట్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు సమాచారం. దీనికి తోడు కుమారస్వామి కాన్సెప్ట్ ఆధారంగా ఇతర సినిమాలు కూడా తెరకెక్కుతుండటంతో ఈ ప్రాజెక్ట్ మరింత ఆలస్యమైతే కథపై ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే ఇన్ని అడ్డంకులు కనిపిస్తున్నప్పటికీ ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్ట్ పూర్తిగా ఆగిపోయిందని చెప్పలేని పరిస్థితి. త్రివిక్రమ్ ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసి సినిమాను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఎన్టీఆర్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడమే కీలకంగా మారిందట.
మరి ఎన్టీఆర్ ఈ భారీ ప్రాజెక్ట్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు? త్రివిక్రమ్‌తో మరోసారి కలిసి పనిచేస్తాడా? లేక వేరే ప్రాజెక్ట్‌కు ప్రాధాన్యత ఇస్తాడా? అనేది తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.








