మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కాకా’ నుంచి ఓ క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సినిమాలో చిరంజీవి యంగ్ లుక్‌కు సంబంధించిన సుమారు 20 సెకన్ల వీడియో క్లిప్ ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమైనట్లు తెలుస్తోంది. స్టైలిష్ సన్‌గ్లాసెస్‌తో సరికొత్త లుక్‌లో కనిపిస్తున్న మెగాస్టార్‌ను చూసి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇప్పటివరకు ఈ లుక్‌ను మేకర్స్ చాలా రహస్యంగా ఉంచగా, ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.
ఇక ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో ‘కాకా’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో మెగాస్టార్ రెండు విభిన్నమైన గెటప్‌లలో కనిపించనున్నట్లు సమాచారం. అనశ్వర రాజన్, నివేతా పేతురాజ్, కబీర్ దుహాన్ సింగ్, అనురాగ్ కశ్యప్, గెటప్ శ్రీను వంటి నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మాణ బాధ్యతలు చేపడుతోంది.
మరోవైపు, ఈ సినిమాను 2027 జనవరి 13న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ యంగ్ లుక్‌లో మెగాస్టార్ వెండితెరపై ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి. సినిమా నుంచి అధికారిక అప్‌డేట్స్ ఎప్పుడు వస్తాయోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.








