యాక్షన్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ – మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూవీ డ్రాగన్. ఈ సినిమా నుంచి ఎప్పుడు ఎలాంటి అప్డేట్ వస్తుందా అని ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
అయితే అక్టోబర్ 15 నుంచి ఎన్టీఆర్ మళ్లీ డ్రాగన్ షూటింగ్లో జాయిన్ అయ్యాడు. ప్రస్తుతం ఈ షెడ్యూల్లో అదిరిపోయే యాక్షన్ సీన్స్‌ను తెరకెక్కిస్తున్నారట. ఈ షెడ్యూల్ పూర్తయిన తర్వాత రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా నిర్మిస్తున్న భారీ సెట్లో ఓ సాంగ్‌ను షూట్ చేయనున్నట్లు సమాచారం. ఈ పాటలో ఎన్టీఆర్ మాత్రమే కనిపించనున్నాడట.
ఇక ఎన్టీఆర్‌తో పాటు సినిమాలోని ఇతర ప్రధాన తారాగణం కూడా షూటింగ్లో పాల్గొంటున్నారట. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తుండగా, రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తున్నారు.
ఇక్కడే మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. ప్రశాంత్ నీల్ సినిమాలంటే సాధారణంగా డార్క్ కలర్ టోన్, బ్లాక్ అండ్ గ్రే విజువల్స్ ఎక్కువగా కనిపిస్తాయి. కానీ డ్రాగన్‌లో మాత్రం ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌ను పూర్తిగా కలర్ఫుల్గా చూపించనున్నారనే టాక్ వినిపిస్తోంది.
మరి ఈ కలర్‌ఫుల్ ఫ్లాష్‌బ్యాక్‌లో నీల్ ఎలాంటి మ్యాజిక్ చూపిస్తాడో చూడాలి. ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు మాత్రం రోజురోజుకూ పెరిగిపోతున్నాయి!








