Search
Close this search box.

  రాజాసాబ్ తర్వాత మారుతి మాస్టర్ ప్లాన్ ఇదేనా..?

October 19, 2026 11:56 AM | Aditya369 News

రాజాసాబ్ తర్వాత మారుతి మాస్టర్ ప్లాన్ ఇదేనా..?

రాజాసాబ్ తర్వాత దర్శకుడు మారుతి తన నెక్స్ట్ మూవీ కోసం సరికొత్త ప్లాన్‌తో సిద్ధమవుతున్నారట. ఈసారి భారీ బడ్జెట్, స్టార్ హీరోల వెంట పడకుండా.. తనకు బాగా కలిసొచ్చిన కామెడీ జానర్‌తో ప్రేక్షకుల ముందుకు రావాలని ఫిక్స్ అయ్యారట.

భలే భలే మగాడివోయ్, మహానుభావుడు సినిమాల తరహాలోనే.. హీరోలో ఉండే ఓ వింత బలహీనత చుట్టూ కథను అల్లుతున్నట్లు సమాచారం. మరి ఈసారి మారుతి ఎలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్‌తో నవ్వులు పూయించబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.

ఇక ఈ సినిమా కోసం కొత్త నటీనటులను తీసుకోవాలని మారుతి భావిస్తున్నారట. పెద్ద హీరోలు, భారీ స్టార్‌డమ్ లేకపోయినా.. కథలో బలం, పాత్రల్లో కొత్తదనం ఉంటే ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించవచ్చనే నమ్మకంతో ఈ ప్రాజెక్ట్‌ను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

అంతేకాదు, నవంబర్‌లో షూటింగ్ ప్రారంభించి, వచ్చే ఏడాది మార్చి నాటికి సినిమాను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారట.

మొత్తానికి రాజాసాబ్ తర్వాత మారుతి మళ్లీ తన కామెడీ ట్రాక్‌లోకి వచ్చేస్తున్నారనే వార్త సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది. మరి ఈ సినిమాతో భలే భలే మగాడివోయ్ మ్యాజిక్‌ను మరోసారి రిపీట్ చేస్తారా? లేదా అనేది చూడాలి. ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వస్తే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది!

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore