ఇండియన్ సినిమా దగ్గర ఉన్నటువంటి కొన్ని కల్ట్ క్లాసిక్ లవ్ స్టొరీ చిత్రాల్లో అక్కినేని నాగార్జున అలాగే లెజెండరీ దర్శకుడు మణిరత్నం కాంబినేషన్లో చేసిన సినిమా ‘గీతాంజలి’ కూడా ఒకటి. అప్పట్లోనే సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ఫ్యాన్స్ అంతా కొన్ని వారాల కితం బాగా డిజప్పాయింట్ అయ్యారు.
ఈ సినిమా రీరిలీజ్ ని ప్లాన్ చేసి ఆపేయడం వారిని డిజప్పాయింట్ చేసింది. అయితే మళ్లీ ఫైనల్ గా ఈ ప్రేమకథకి డేట్ లాక్ అయింది. రానున్న నవంబర్ 13న మేకర్స్ సినిమాని గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు. సో అప్పుడు మిస్ అయిన వారికి ఇదో మంచి వార్తే అని చెప్పాలి. ఇక ఈ సినిమాలో గిరిజ షెట్టర్ హీరోయిన్ గా నటించగా ఇళయరాజా అద్భుతమైన సంగీతం అందించారు.








