ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్లో మరో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. తన తాతయ్య, దిగ్గజ నటుడు అల్లు రామలింగయ్య జయంతి సందర్భంగా ‘ICONZA’ పేరుతో సరికొత్త క్రియేటివ్ ఆఫీస్ స్పేస్‌ను గ్రాండ్‌గా ప్రారంభించారు.
ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. తాతయ్య ఆశీస్సులతోనే ఈ కొత్త కార్యాలయాన్ని ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందంటూ బన్నీ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
“A new space. A new chapter. A legacy that continues” అంటూ సోషల్ మీడియాలో ఈ కొత్త జర్నీకి సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకున్నారు.
ఇక ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్, అల్లు శిరీష్, అల్లు బాబీతో పాటు పలువురు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. క్రియేటివ్ ఆలోచనలు, కొత్త కాన్సెప్ట్స్, వినూత్న ప్రాజెక్టులకు వేదికగా ఉండేలా ‘ICONZA’ను రూపొందించినట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా తన తాతయ్య జయంతి రోజునే ఈ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడం ప్రత్యేకంగా నిలిచింది. దీంతో అల్లు అర్జున్ అభిమానులు, సినీ వర్గాల నుంచి ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
మరి ‘ICONZA’ నుంచి బన్నీ ఎలాంటి కొత్త క్రియేటివ్ ప్రాజెక్టులను తీసుకురాబోతున్నారో చూడాలి.








