నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’పై అంచనాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తేనే అర్థమవుతోంది. ఈ గురువారం సినిమా థియేటర్లలోకి రాబోతుండగా.. నైజాం ఏరియాలో మొదలైన బుకింగ్స్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.
బుకింగ్స్ ప్రారంభమైన కొద్దిసేపటికే కోటి రూపాయలకు పైగా గ్రాస్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. డిస్ట్రిక్ట్ యాప్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయగానే ప్రేక్షకులు టికెట్ల కోసం భారీగా క్యూ కట్టారు. ఇప్పటికే లక్షకు పైగా టికెట్లు అమ్ముడైనట్లు తెలుస్తుండగా.. పలు షోలు హౌస్‌ఫుల్ అవుతున్నాయి.
‘దసరా’ తర్వాత నాని, శ్రీకాంత్ ఓదెల కలిసి చేస్తున్న సినిమా కావడంతో ‘ది ప్యారడైజ్’పై మొదటి నుంచే భారీ హైప్ ఉంది. ఈసారి కూడా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల బలమైన కథ, యాక్షన్ ఎలిమెంట్స్‌తో సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇక నాని కూడా ఇంతకుముందెన్నడూ కనిపించని డిఫరెంట్ లుక్‌లో కనిపించనుండటం సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది.
ఈ సినిమాలో నానికి జోడీగా కయాదు లోహర్ నటిస్తుండగా.. సీనియర్ నటుడు మోహన్ బాబు కీలకమైన ప్రతినాయక పాత్రలో కనిపించనున్నారు. రాఘవ్ జుయల్, తనికెళ్ల భరణి కూడా ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ అందించిన సంగీతం సినిమాకు మరో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.
ఇక ప్రమోషన్స్‌లో భాగంగా ఈరోజు హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో గ్రాండ్‌గా ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో అభిమానులకు ఓ స్పెషల్ సర్‌ప్రైజ్ కూడా ఉండబోతుందని చిత్రబృందం ప్రకటించడంతో ఈ ఈవెంట్‌పై కూడా ఆసక్తి నెలకొంది.
మరి అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే ఈ రేంజ్ రెస్పాన్స్ అందుకుంటున్న ‘ది ప్యారడైజ్’.. థియేటర్లలో ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి.







