‘లాలో – కృష్ణ సదా సహాయతే’.. కేవలం రూ.50 లక్షల చిన్న బడ్జెట్‌తో తెరకెక్కి, అద్భుతమైన మౌత్ టాక్‌తో ఏకంగా రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి సంచలన విజయాన్ని అందుకున్న సినిమా ఇది.
ఈ సినిమా సక్సెస్ తర్వాత తెలుగు రీమేక్‌పై కూడా ఆసక్తి పెరిగింది. ఇప్పటికే ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతున్నారని.. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
కృష్ణుడిగా విజయ్ దేవరకొండ?
ఇప్పటివరకు ఈ తెలుగు రీమేక్‌లో శ్రీకృష్ణుడి పాత్రలో రామ్ చరణ్ కనిపించబోతున్నాడనే వార్తలు వైరల్ అయ్యాయి. చరణ్ బాడీ లాంగ్వేజ్‌కు కృష్ణుడి పాత్ర పర్ఫెక్ట్గా సెట్ అవుతుందని అభిమానులు కూడా భావించారు.
కానీ ఇప్పుడు సీన్ మారినట్లు తెలుస్తోంది.
తాజా సమాచారం ప్రకారం రామ్ చరణ్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడని.. ఆయన స్థానంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఎంట్రీ ఇచ్చాడనే వార్తలు వినిపిస్తున్నాయి.
విజయ్ దేవరకొండ శ్రీకృష్ణుడి పాత్రలో కనిపించబోతున్నాడనే రూమర్ బయటకు రావడంతో సోషల్ మీడియాలో ఒక్కసారిగా ఈ న్యూస్ వైరల్‌గా మారింది.
విజయ్ కృష్ణుడిగా కనిపిస్తే.. ఐ ఫీస్టే!
విజయ్ దేవరకొండ ఇప్పటికే ‘కల్కి 2898 ఏడీ’ సినిమాలో అర్జునుడి పాత్రలో కొద్దిసేపు కనిపించి తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకున్నాడు.
ఇప్పుడు అదే తరహాలో మోడ్రన్ టచ్‌తో కూడిన శ్రీకృష్ణుడి పాత్రలో విజయ్ను చూడబోతున్నామనే వార్త నిజమైతే మాత్రం అభిమానులకు ఇది మాంచి ఐ ఫీస్ట్ అనే చెప్పాలి.
అయితే ప్రస్తుతం విజయ్ ఈ పాత్రకు ఓకే చెప్పాడా లేదా అనేది అధికారికంగా తెలియాల్సి ఉంది.
దిల్ రాజు భారీ ప్లాన్!
ఇక తెలుగు రీమేక్ కోసం ఒరిజినల్ సినిమాలోని గుజరాతీ నేటివిటీని పక్కనపెట్టి.. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా కథ, స్క్రీన్‌ప్లేలో కొన్ని కీలక మార్పులు చేయబోతున్నట్లు టాక్.
దిల్ రాజు ఈ సినిమాను ప్రెస్టీజియస్‌గా తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విజయ్ దేవరకొండ ఈ డివోషనల్ డ్రామాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే మాత్రం.. ఈ కాంబినేషన్‌పై అంచనాలు భారీగా పెరగడం ఖాయం.
అసలు కథ ఏంటి?
‘లాలో’ కథ విషయానికి వస్తే.. ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఓ సాధారణ ఆటో డ్రైవర్ జీవితంలోకి శ్రీకృష్ణుడు వచ్చి.. అతనికి ఎలా మార్గదర్శనం చేశాడనే ఆసక్తికరమైన పాయింట్ చుట్టూ ఈ సోషియో-ఫాంటసీ కథ సాగుతుంది.
మరి నిజంగానే రామ్ చరణ్ స్థానంలో విజయ్ దేవరకొండ కృష్ణుడిగా కనిపించబోతున్నాడా? ఈ ప్రాజెక్ట్‌కు విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా? అనే విషయాలపై మేకర్స్ ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి.








