కోలీవుడ్ స్టార్ హీరో సూర్య.. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఆయన తదుపరి ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ అవుతోంది. స్టార్ డైరెక్టర్ హెచ్. వినోద్ దర్శకత్వంలో సూర్య నటించబోయే సినిమాలో అక్కినేని నాగార్జున కీలక పాత్రలో కనిపించనున్నారనే టాక్ వినిపిస్తోంది.
ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉన్నట్లు సమాచారం. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో కీలక పాత్ర కోసం నాగార్జునను మేకర్స్ సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం.
ఇక ఈ సినిమాను సూర్య, జ్యోతికలకు చెందిన ‘జగరమ్ స్టూడియోస్’ నిర్మించనున్నట్లు తెలుస్తోంది. సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం వామికా గబ్బి పేరును పరిశీలిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.
మరోవైపు నాగార్జున విషయానికి వస్తే.. ఇటీవల రజినీకాంత్ హీరోగా నటించిన ‘కూలీ’ సినిమాలో కీలకమైన పాత్రలో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ప్రస్తుతం తన కెరీర్‌లో ఎంతో ప్రతిష్టాత్మకమైన 100వ సినిమా ‘కింగ్ 100’పై దృష్టి పెట్టారు.
ఇక సూర్య కూడా తన ప్రస్తుత కమిట్‌మెంట్స్ పూర్తి చేసిన తర్వాతే హెచ్. వినోద్ ప్రాజెక్ట్‌ను సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నట్లు సమాచారం.
ఒకవేళ సూర్య, నాగార్జున కాంబినేషన్ నిజమైతే మాత్రం ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు నెక్స్ట్ లెవల్‌కు వెళ్లడం ఖాయం. కోలీవుడ్ స్టార్ సూర్య, టాలీవుడ్ కింగ్ నాగార్జున ఒకే సినిమాలో కనిపిస్తే.. రెండు ఇండస్ట్రీల అభిమానులకు ఇది నిజంగానే స్పెషల్ ట్రీట్ అవుతుంది.








