కన్నడ స్టార్ హీరో, అభినయ చక్రవర్తి కిచ్చా సుదీప్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు మేకర్స్ అదిరిపోయే కింగ్-సైజ్ సర్‌ప్రైజ్ ఇచ్చారు.
విజయనగర సామ్రాజ్యాన్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్లిన చారిత్రక చక్రవర్తి శ్రీ కృష్ణదేవరాయలు పాత్రలో సుదీప్ నటించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
‘దేవరాయ’గా కిచ్చా సుదీప్!
ఈ సినిమాకు ‘దేవరాయ’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు. పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ పీరియాడికల్ ప్రాజెక్ట్‌ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, సుప్రియ్యాన్వి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ఈ చిత్రానికి గౌర హరి సంగీతం అందించనుండగా.. విజయనగర సామ్రాజ్య వైభవాన్ని, అప్పటి చారిత్రక నేపథ్యాన్ని భారీ విజువల్స్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
2027లో థియేటర్లలోకి!
ఒక యుగాన్ని శాసించిన మహారాజు పాత్రలో సుదీప్ కనిపించబోతుండటంతో ఈ సినిమాపై ఇప్పటినుంచే భారీ అంచనాలు మొదలయ్యాయి.
ముఖ్యంగా కృష్ణదేవరాయలుగా సుదీప్ లుక్ ఎలా ఉండబోతుంది? ఆయన పాత్రను ఏ రేంజ్‌లో చూపించబోతున్నారు? అనే ఆసక్తి అభిమానుల్లో మొదలైంది.
ఈ పీరియాడికల్ విజువల్ వండర్‌ను 2027 డిసెంబర్‌లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
అయితే ఈ సినిమాకు దర్శకత్వం వహించబోయే దర్శకుడి పేరును మాత్రం ఇంకా వెల్లడించలేదు. దీంతో దర్శకుడు ఎవరనే విషయంపై కూడా ఆసక్తి నెలకొంది.
మొత్తానికి కృష్ణదేవరాయలుగా కిచ్చా సుదీప్.. ‘దేవరాయ’ టైటిల్.. భారీ బడ్జెట్ పీరియాడికల్ కథ కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటినుంచే అంచనాలు భారీగా పెరిగిపోయాయి.








