Search
Close this search box.

  మళ్ళీ రిస్క్ చేస్తున్న రవితేజ..? తొలిసారి ఆ జోనర్ లో సినిమా..?

September 2, 2026 7:43 AM | Aditya369 News

మళ్ళీ రిస్క్ చేస్తున్న రవితేజ..? తొలిసారి ఆ జోనర్ లో సినిమా..?

మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు. ‘ఇరుముడి’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న రవితేజ.. అదే జోష్‌లో వరుసగా కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఈసారి మాత్రం తన రెగ్యులర్ మాస్ యాక్షన్ జోనర్‌కు భిన్నంగా ఓ సరికొత్త ప్రయోగం చేయబోతున్నట్లు తెలుస్తోంది.

టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రవితేజ ఓ హారర్ కామెడీ సినిమాలో నటించనున్నారనే వార్త ప్రస్తుతం ఇండస్ట్రీలో ఆసక్తిని రేపుతోంది. ఇప్పటివరకు ఈ జోనర్‌లో పెద్దగా కనిపించని రవితేజ.. కథ వినగానే ఇంప్రెస్ అయి వెంటనే ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పినట్లు సమాచారం.

ఈ సినిమాను దిల్ రాజు మాజీ భాగస్వామి లక్ష్మణ్ నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని సమాచారం.

మరోవైపు రవితేజ మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. డైరెక్టర్ హసిత్ గోలీ దర్శకత్వంలో హీరో శ్రీవిష్ణుతో కలిసి ఓ మల్టీస్టారర్ కామెడీ ఎంటర్‌టైనర్‌లో నటించనున్నారు.

ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీని 2027 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. రవితేజ, శ్రీవిష్ణు కాంబినేషన్‌లో వస్తున్న ఈ మల్టీస్టారర్‌పై కూడా మంచి అంచనాలు ఉన్నాయి.

ప్రస్తుతం ఈ రెండు సినిమాలకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఒకవైపు హారర్ కామెడీతో కొత్తగా కనిపించబోతున్న రవితేజ.. మరోవైపు శ్రీవిష్ణుతో కలిసి కామెడీ ఎంటర్‌టైనర్‌లో సందడి చేయనున్నారు.

మరి రవితేజ చేస్తున్న ఈ రెండు విభిన్నమైన ప్రయత్నాలు ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాయో.. ముఖ్యంగా హారర్ కామెడీ జోనర్‌లో మాస్ మహారాజా ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తారో చూడాలి.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore