Search
Close this search box.

  ‘దాదా’గా బాలయ్య..? NBK 111 టైటిల్ ఇదేనా..?

August 31, 2026 8:29 PM | Aditya369 News

‘దాదా’గా బాలయ్య..? NBK 111 టైటిల్ ఇదేనా..?

నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. గత ఏడాది ‘అఖండ 2’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాలయ్యకు ఆశించిన స్థాయిలో ఫలితం దక్కలేదు. దీంతో ఇప్పుడు తన తదుపరి సినిమాతో ఎలాగైనా భారీ హిట్ అందుకోవాలని అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అందులోనూ దర్శకుడు గోపీచంద్ మలినేనితో బాలకృష్ణకు ఇది రెండో సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘వీరసింహారెడ్డి’ మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.

ప్రస్తుతం NBK 111 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా మేకర్స్ కీలక అప్డేట్ ఇచ్చారు. “Who let the LION out?” అంటూ బాలయ్య అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతూ, సెప్టెంబర్ 6న ఈ సినిమాకు సంబంధించిన బిగ్ అప్డేట్ రాబోతుందని ప్రకటించారు.

దీంతో అదే రోజు సినిమా టైటిల్‌ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది.

ఇక NBK 111 కోసం ఇప్పటికే రెండు టైటిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాకు ‘గాడ్’ లేదా ‘దాదా’ అనే టైటిల్స్‌ను పరిశీలిస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ రెండింటిలో ఏ టైటిల్‌ను ఫైనల్ చేశారనే విషయం సెప్టెంబర్ 6న క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ఇక ఈ సినిమాలో బాలకృష్ణకు జోడీగా కాజల్ అగర్వాల్ నటించనున్నట్లు సమాచారం. మొదట హీరోయిన్‌గా నయనతారను ఎంపిక చేసినప్పటికీ, కథలో కొన్ని మార్పులు చేయడంతో ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి.

మరోవైపు ఈ చిత్రంలో మంచు మనోజ్, సంజయ్ దత్, శరత్ కుమార్, సముద్రఖని వంటి పలువురు ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది.

వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు.

షూటింగ్ కొంత ఆలస్యంగా ప్రారంభం కావడంతో పాటు ఇటీవల బాలకృష్ణకు సర్జరీ కావడంతో చిత్రీకరణకు చిన్న విరామం కూడా వచ్చింది. ప్రస్తుతం మేకర్స్ సినిమాను వేగంగా పూర్తి చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక బాలకృష్ణ మరోవైపు దర్శకుడు కొరటాల శివతో కూడా ఓ సినిమాకు కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కూడా త్వరలోనే ప్రారంభం కానున్నట్లు సమాచారం.

మొత్తానికి NBK 111 టైటిల్‌పై నెలకొన్న సస్పెన్స్‌కు సెప్టెంబర్ 6న తెరపడనుంది. ‘గాడ్’నా? ‘దాదా’నా? లేక అభిమానులను సర్‌ప్రైజ్ చేసే మరో పవర్‌ఫుల్ టైటిల్‌నా? తెలియాలంటే సెప్టెంబర్ 6 వరకు వెయిట్ చేయాల్సిందే!

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు