Search
Close this search box.

  వెంకీ అట్లూరి నెక్స్ట్ టార్గెట్ చిరంజీవేనా..?

August 16, 2026 7:50 PM | Aditya369 News

వెంకీ అట్లూరి నెక్స్ట్ టార్గెట్ చిరంజీవేనా..?

‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాతో దర్శకుడు వెంకీ అట్లూరి మరో విజయాన్ని అందుకున్నారు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రానికి మంచి స్పందన రావడంతో ఆయన తదుపరి ప్రాజెక్ట్‌పై ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవి కోసం తన దగ్గర ఉన్న కథ గురించి వెంకీ అట్లూరి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

చిరంజీవి అంటే చిన్నప్పటి నుంచి తనకు ఎంతో అభిమానమని చెప్పిన వెంకీ.. ఆయనలాంటి స్టార్ హీరోను సంప్రదించే ముందు దర్శకుడిగా అన్ని విధాలా సిద్ధంగా ఉండాలని భావిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం తన దగ్గర చిరంజీవి కోసం ఓ కథాంశం ఉందని, అది థ్రిల్లర్ జానర్‌కు చెందిన కథ అని వెల్లడించారు.

అయితే ఇంత భారీ స్థాయి చిత్రాన్ని తెరకెక్కించేందుకు తనకు మరింత పరిణితి, అనుభవం, సమయం అవసరమని వెంకీ అట్లూరి అభిప్రాయపడ్డారు. దీంతో చిరంజీవి-వెంకీ అట్లూరి కాంబినేషన్ ఇప్పట్లోనే వస్తుందా? లేక మరికొంత సమయం పడుతుందా? అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.

ఇక ‘విశ్వనాథ్ & సన్స్’ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించగా.. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు