తెలుగు చిత్రసీమలో తన అందం, అభినయంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రితికా నాయక్ తాజాగా విడుదలైన ‘కొరియన్ కనకరాజు’ చిత్రంతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాలో ఆమె నటనతో పాటు స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. యువ ప్రేక్షకుల్లో ఆమెకు మంచి క్రేజ్ ఏర్పడుతుండగా, సినిమాకు కూడా ఆమె పాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
గ్లామర్‌తో పాటు నటనకూ సమాన ప్రాధాన్యం ఇస్తున్న రితికా నాయక్ వరుస విజయాలతో టాలీవుడ్లో తన స్థాయిని మరింత పెంచుకుంటోంది. పాత్రలో ఒదిగిపోయే తీరు, సహజమైన నటన ఆమెకు మంచి ప్రశంసలు తెచ్చిపెడుతున్నాయి. దీంతో దర్శకులు, నిర్మాతల దృష్టి కూడా ఇప్పుడు ఆమెపై మరింతగా పడుతోంది.
ఇటీవలి విజయాల నేపథ్యంలో రితికా నాయక్‌ను టాలీవుడ్లో పలువురు నిర్మాతలు ‘లక్కీ చార్మ్’గా భావిస్తున్నారనే చర్చ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. వరుసగా క్రేజీ ప్రాజెక్టులు ఆమె ఖాతాలో చేరుతున్నట్లు తెలుస్తుండగా, రానున్న రోజుల్లో టాలీవుడ్లో అత్యంత బిజీ హీరోయిన్లలో ఒకరిగా రితికా నాయక్ నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.








