ఇటీవల కాలంలో టాలీవుడ్ అగ్ర హీరోలు వరుసగా గాయాల బారిన పడటం అభిమానుల్లో కలవరాన్ని పెంచుతోంది. స్టార్ హీరోల సినిమాలు భారీ స్థాయిలో తెరకెక్కుతున్న సమయంలో, షూటింగ్‌ల మధ్య చోటుచేసుకుంటున్న ఈ గాయాలు చర్చనీయాంశంగా మారాయి.
మొదట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భుజానికి సంబంధించిన సమస్యతో శస్త్రచికిత్స చేయించుకోగా, ఆ తర్వాత బాలకృష్ణ ‘NBK111’ షూటింగ్ సమయంలో మోకాలికి గాయం కావడంతో సర్జరీ చేయించుకున్న విషయం తెలిసిందే.
ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మణికట్టు గాయంతో చికిత్స తీసుకుంటుండగా, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా భుజం గాయం కారణంగా కొంతకాలం విశ్రాంతి తీసుకోనున్నట్లు సమాచారం.
ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. మెగా, నందమూరి కుటుంబాల నుంచి వచ్చిన బాబాయ్–అబ్బాయి జోడీలు ఈ గాయాల జాబితాలో ఉండటం. పవన్ కళ్యాణ్–రామ్ చరణ్, బాలకృష్ణ–ఎన్టీఆర్ ఇలా రెండు కుటుంబాలకు చెందిన స్టార్ హీరోలు ఒకే సమయంలో గాయాల బారిన పడటం అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది.
అయితే ఈ గాయాల ప్రభావం అన్ని సినిమాలపై ఒకేలా పడకపోవచ్చని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, ఎన్టీఆర్ సినిమాల షూటింగ్‌లకు పెద్దగా ఆటంకం ఉండకపోవచ్చని సమాచారం. కానీ డిసెంబర్ విడుదల లక్ష్యంగా తెరకెక్కుతున్న బాలకృష్ణ ‘NBK111’ ప్రాజెక్ట్‌పై మాత్రం కొంత ప్రభావం పడే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.
ఏదేమైనా, తమ అభిమాన హీరోలు త్వరగా కోలుకుని తిరిగి షూటింగ్‌ల్లో పాల్గొనాలని సినీ వర్గాలతో పాటు అభిమానులు కూడా కోరుకుంటున్నారు.








