Search
Close this search box.

  ‘శ్రీనివాస మంగాపురం’ కథలో కొత్త ట్విస్ట్.. అజయ్ భూపతి మార్క్ కనిపించనుందా..?

July 27, 2026 12:46 PM | Aditya369 News

‘శ్రీనివాస మంగాపురం’ కథలో కొత్త ట్విస్ట్.. అజయ్ భూపతి మార్క్ కనిపించనుందా..?

దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో లెజెండరీ సూపర్ స్టార్ కృష్ణ మనవడు, ఘట్టమనేని రమేష్ బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం 'శ్రీనివాస మంగాపురం'. ఇప్పటికే ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ సినిమా 2026 జూలై 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

 

తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రంలో సీనియర్ నటుడు నరేష్ 'స్వతంత్ర బాబాయ్' అనే ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. ఈ పాత్ర పూర్తి వినోదాత్మకంగా ఉండటంతో పాటు, బోల్డ్ షేడ్‌లోనూ డిజైన్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. సినిమాలో ఈ పాత్ర ప్రేక్షకులను నవ్వించే కీలక ఆకర్షణగా నిలుస్తుందని ప్రచారం జరుగుతోంది.

 

అశ్వినీ దత్ సమర్పణలో, పి. కిరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 'చందమామ కథలు' బ్యానర్‌పై రూపొందిస్తున్నారు. తిరుపతి నేపథ్యంలో, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ పరిసరాల్లో జరిగే ఓ ఆసక్తికర సంఘటన ఆధారంగా కథ సాగుతుందని సమాచారం. ఈ కథలో ఆధ్యాత్మికతతో పాటు వినోదం, భావోద్వేగాలకు కూడా సమాన ప్రాధాన్యం ఉంటుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

 

ముఖ్యంగా ఈ సినిమా కథాంశం ఇప్పటివరకు తెలుగు తెరపై చూడని విధంగా ఉంటుందని, ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించేలా దర్శకుడు అజయ్ భూపతి రూపొందించినట్లు తెలుస్తోంది. జాతీయ అవార్డు గ్రహీత జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి రోజురోజుకు పెరుగుతోంది. మరి 'శ్రీనివాస మంగాపురం' విడుదల తర్వాత ఎలాంటి స్పందన అందుకుంటుందో చూడాలి.

దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో లెజెండరీ సూపర్ స్టార్ కృష్ణ మనవడు, ఘట్టమనేని రమేష్ బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’. ఇప్పటికే ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ సినిమా 2026 జూలై 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

 

తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రంలో సీనియర్ నటుడు నరేష్ ‘స్వతంత్ర బాబాయ్’ అనే ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. ఈ పాత్ర పూర్తి వినోదాత్మకంగా ఉండటంతో పాటు, బోల్డ్ షేడ్‌లోనూ డిజైన్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. సినిమాలో ఈ పాత్ర ప్రేక్షకులను నవ్వించే కీలక ఆకర్షణగా నిలుస్తుందని ప్రచారం జరుగుతోంది.

 

అశ్వినీ దత్ సమర్పణలో, పి. కిరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ‘చందమామ కథలు’ బ్యానర్‌పై రూపొందిస్తున్నారు. తిరుపతి నేపథ్యంలో, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ పరిసరాల్లో జరిగే ఓ ఆసక్తికర సంఘటన ఆధారంగా కథ సాగుతుందని సమాచారం. ఈ కథలో ఆధ్యాత్మికతతో పాటు వినోదం, భావోద్వేగాలకు కూడా సమాన ప్రాధాన్యం ఉంటుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

 

ముఖ్యంగా ఈ సినిమా కథాంశం ఇప్పటివరకు తెలుగు తెరపై చూడని విధంగా ఉంటుందని, ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించేలా దర్శకుడు అజయ్ భూపతి రూపొందించినట్లు తెలుస్తోంది. జాతీయ అవార్డు గ్రహీత జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి రోజురోజుకు పెరుగుతోంది. మరి ‘శ్రీనివాస మంగాపురం’ విడుదల తర్వాత ఎలాంటి స్పందన అందుకుంటుందో చూడాలి.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు