ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘రాకా’పై రోజురోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి. ఈ సినిమా నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కోసం బన్నీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే, తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ క్రేజీ రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అదేంటంటే.. ఈ సినిమాలో అల్లు అర్జున్ ఏకంగా నాలుగు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారట. తాత, తండ్రి, ఇద్దరు కుమారుల పాత్రలను కూడా బన్నీనే పోషించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వార్త అభిమానుల్లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే ఈ విషయంపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దీంతో ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.
ఇక హీరోయిన్ల విషయానికి వస్తే.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణెతో పాటు మృణాల్ ఠాకూర్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. అలాగే జాన్వీ కపూర్ కూడా మరో హీరోయిన్గా కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది.
ఈ సినిమాకు అట్లీ తన మార్క్‌కు తగ్గట్టుగా పవర్ఫుల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో ఓ డాన్ జీవితాన్ని కేంద్రంగా చేసుకుని కథ సాగుతుందని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, కథలో కీలక మలుపులు తీసుకొచ్చేలా పలువురు స్టార్ నటులతో ప్రత్యేక గెస్ట్ రోల్స్‌ను కూడా అట్లీ డిజైన్ చేస్తున్నట్లు సమాచారం.
సన్ పిక్చర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 2027లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అధికారిక అప్డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, ఈ సినిమా ఇప్పటికే ఇండియన్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్‌లలో ఒకటిగా నిలిచింది.








