తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటుతున్న మెగా ఫ్యామిలీ.. ఇప్పుడు సినీ చరిత్రలోనే ఎవరికీ సాధ్యం కాని అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఒకే క్యాలెండర్ ఇయర్‌లో ఒకే కుటుంబానికి చెందిన తండ్రీకొడుకుల సినిమాలు విడుదలై, రెండు చిత్రాలు కూడా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించడం ప్రపంచ సినిమా చరిత్రలోనే తొలిసారి కావడం విశేషం.
ఒకవైపు “మన శంకర వర ప్రసాద్ గారు”.. మరోవైపు “పెద్ది”..
మెగాస్టార్ చిరంజీవి నటించిన “మన శంకర వర ప్రసాద్ గారు” ప్రేక్షకుల నుంచి అద్భుతమైన ఆదరణ పొందుతూ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. తనదైన నటన, అపారమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో చిరంజీవి మరోసారి తన స్టార్‌డమ్‌కు నిదర్శనంగా నిలిచారు. ఫలితంగా ఈ చిత్రం సునాయాసంగా రూ.300 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టింది.
ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వచ్చిన “పెద్ది” కూడా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ భారీ విజయాన్ని అందుకుంది. విభిన్నమైన కథ, మాస్ ప్రేక్షకులను ఆకట్టుకున్న చరణ్ పర్ఫార్మెన్స్, ఎమోషనల్ ఎలిమెంట్స్ కలిసి ఈ సినిమాను మరో బ్లాక్‌బస్టర్‌గా నిలబెట్టాయి. అతి తక్కువ సమయంలోనే ఈ చిత్రం కూడా రూ.300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది.
ఒకే ఏడాదిలో చిరు-చరణ్ చరిత్ర..
ఒకే సంవత్సరంలో తండ్రీకొడుకులు ఇద్దరూ విడివిడిగా రూ.300 కోట్ల మైలురాయిని అందుకోవడం భారతీయ సినీ పరిశ్రమలోనే కాదు.. ప్రపంచ సినిమా చరిత్రలో కూడా అత్యంత అరుదైన ఘనతగా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఏ స్టార్ ఫ్యామిలీకి సాధ్యం కాని ఈ ఫీట్‌ను మెగా ఫ్యామిలీ సుసాధ్యం చేసింది.
బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడం మెగా కుటుంబానికి కొత్త విషయం కాకపోయినా.. ఈ రికార్డు మాత్రం ప్రత్యేకమైనది. భవిష్యత్తులో ఈ ఘనతను మరే తండ్రీకొడుకుల జంట అధిగమిస్తుందా లేదా అనేది కాలమే నిర్ణయించాలి. కానీ ప్రస్తుతం మాత్రం ఈ అపూర్వ విజయంతో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.








