కోలీవుడ్‌లో ప్రస్తుతం వినిపిస్తున్న హాట్ బజ్ ప్రకారం.. సూర్య తన కెరీర్లో 50వ సినిమాను స్టార్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో చేయబోతున్నాడట. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన చర్చలు ఇప్పటికే ప్రారంభమైనట్లు సమాచారం.
విజయ్ రాజకీయాల్లోకి వెళ్లడం, అజిత్ కుమార్ రేసింగ్‌పై ఎక్కువ దృష్టి పెట్టడంతో తమిళ నిర్మాతలు, దర్శకులకు ఇప్పుడు సూర్యనే మొదటి ఎంపికగా మారాడనే టాక్ వినిపిస్తోంది. దీంతో సూర్య 50వ సినిమాను అత్యంత భారీ స్థాయిలో రూపొందించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది.
అయితే ఈ ప్రాజెక్ట్‌లో మరో ఆసక్తికరమైన అంశం కూడా ఉంది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించబోతోందని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. నిర్మాత నాగవంశీ ఇప్పటికే దర్శకుడు నెల్సన్‌కు అడ్వాన్స్ కూడా ఇచ్చినట్లు ప్రచారం సాగుతోంది.
నిజానికి నెల్సన్, జూనియర్ ఎన్టీఆర్‌తో ఓ సినిమా చేయాల్సి ఉంది. కానీ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’, అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందించనున్న ‘గాడ్ ఆఫ్ వార్’ వంటి భారీ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉండటంతో.. ఆ గ్యాప్‌లో సూర్య సినిమాను పట్టాలెక్కించే ప్లాన్ జరుగుతోందట.
మరోవైపు నెల్సన్ ప్రస్తుతం ‘జైలర్ 2’ పనుల్లో బిజీగా ఉన్నాడు. అలాగే రజనీకాంత్ – కమల్ హాసన్ కాంబినేషన్లో ఓ మల్టీస్టారర్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన చర్చలు కూడా కొనసాగుతున్నాయని సమాచారం.
ఇక సూర్య విషయానికి వస్తే.. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఆ తర్వాత జితు మాధవన్, టి.జె. జ్ఞానవేల్ చిత్రాలను పూర్తి చేసి.. నెల్సన్ దర్శకత్వంలో తన 50వ సినిమాను ప్రారంభించే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
అయితే ఇప్పటి వరకు ఈ ప్రాజెక్ట్‌పై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. నిజంగానే సూర్య కెరీర్‌లోని ఈ ల్యాండ్‌మార్క్ మూవీని నాగవంశీ నిర్మిస్తారా? నెల్సన్ – సూర్య కాంబో నిజమవుతుందా? లేక ఇవన్నీ కేవలం ఇండస్ట్రీ బజ్ మాత్రమేనా? అనే ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.








