యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్’ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఒక ఆసక్తికరమైన అప్డేట్ టాలీవుడ్లో చక్కర్లు కొడుతోంది. ‘కేజీఎఫ్’, ‘సలార్’ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రంపై దేశవ్యాప్తంగా అంచనాలు నెలకొన్నాయి. కాగా, తారక్ పుట్టినరోజు సందర్భంగా మే 20న ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేస్తారని అందరూ భావించారు.
అయితే, అభిమానుల ఉత్సాహాన్ని మరింత పెంచేలా మేకర్స్ ఒక రోజు ముందుగానే ఈ గ్లింప్స్‌ను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మే 19 అర్ధరాత్రి 12 గంటలకు ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేసి, తారక్ పుట్టినరోజు వేడుకలను ముందుగానే ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. దీంతో అభిమానుల సంబరాలు అర్ధరాత్రి నుంచే మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది.
మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ పాన్-ఇండియా చిత్రం ‘RRR’ తర్వాత తారక్ చేస్తున్న సోలో ప్రాజెక్ట్ కావడంతో దీనిపై భారీ హైప్ నెలకొని ఉంది. ఈ చిత్రాన్ని 2027 జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ప్రశాంత్ నీల్ మార్క్ యాక్షన్, ఎలివేషన్స్‌తో తారక్‌ను ఎలా చూపిస్తారోనని సినీ ప్రియులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.








