టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ నేడు తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న సినిమాల నుంచి వరుస అప్డేట్స్ విడుదలవుతూ అభిమానులను ఖుషీ చేస్తున్నాయి. ఇప్పటికే ‘రౌడీ జనార్ధన్’, ‘రణబలి’ సినిమాల నుంచి పోస్టర్లు, స్పెషల్ వీడియోలు విడుదల కాగా… ఇప్పుడు దర్శకుడు శౌర్యవ్ తెరకెక్కిస్తున్న కొత్త సినిమా నుంచి మరో ఇంట్రెస్టింగ్ పోస్టర్ బయటకు వచ్చింది.
ఇటీవలే అధికారికంగా ప్రకటించిన ఈ ప్రాజెక్ట్‌పై మొదటి నుంచే మంచి అంచనాలు ఉన్నాయి. అయితే విజయ్ బర్త్‌డే సందర్భంగా విడుదల చేసిన తాజా పోస్టర్ మాత్రం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. పోస్టర్లో విజయ్ దేవరకొండ కుర్చీలో కూర్చుని చేతిలో కత్తి పట్టుకుని కనిపించగా… ఆయన కళ్లకు గంతులు కట్టిన లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. దీనికి తోడు “ప్రపంచం చేత నిందించబడ్డాడు… విధి చేత పట్టాభిషిక్తుడయ్యాడు” అనే పవర్ఫుల్ క్యాప్షన్ కూడా ఆసక్తిని మరింత పెంచింది.
ఇప్పుడు అభిమానుల మధ్య పెద్ద డిస్కషన్ ఏంటంటే… ఈ సినిమాలో విజయ్ దేవరకొండ చూపులేని వ్యక్తి పాత్రలో కనిపించబోతున్నారా? అనే విషయం. ఎందుకంటే ఇప్పటికే విడుదలైన మరో పోస్టర్లో ఆయన పక్కన కుక్కలు నడుస్తూ కనిపించాయి. దీంతో అవి గైడ్ డాగ్స్ అయ్యి ఉండొచ్చని, విజయ్ క్యారెక్టర్‌కు చూపు ఉండకపోవచ్చని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ థియరీలు మొదలుపెట్టారు.
ఒకవేళ ఇదే నిజమైతే… విజయ్ దేవరకొండ కెరీర్లో ఇది చాలా డిఫరెంట్ మరియు ఛాలెంజింగ్ రోల్ అవుతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటివరకు ఎక్కువగా మాస్, అటిట్యూడ్ పాత్రల్లో కనిపించిన విజయ్… ఈసారి పూర్తి భిన్నమైన పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారనే టాక్ వినిపిస్తోంది.
ఇక ఈ చిత్రాన్ని వైరా క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తోంది. హీరోయిన్ ఎవరు? కథ ఏంటి? వంటి వివరాలపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ హీరోయిన్గా నటించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. దీనిపై కూడా చిత్ర బృందం నుంచి స్పష్టత రావాల్సి ఉంది.
మొత్తానికి విజయ్ దేవరకొండ బర్త్‌డే సందర్భంగా వచ్చిన ఈ ఒక్క పోస్టర్‌తోనే సినిమాపై భారీ ఆసక్తి నెలకొంది. ఇక ఈ ప్రాజెక్ట్ నుంచి వచ్చే తదుపరి అప్డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.








