కాకినాడ జిల్లా పిఠాపురం మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా పాదగయ క్షేత్రంలో రథోత్సవం రోజున జరిగే దొంగల దోపు ఉత్సవం, నాకాబందీ, దండాడింపు కార్యక్రమం అత్యంతఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవంలో కాకినాడ ఎంపీ తంగెళ్ల శ్రీనివాస్,కాకినాడ జిల్లా జనసేన అధ్యక్షుడు తుమ్మలబాబు, మాజీ ఎమ్మెల్యేలు వర్మ, పెండెం దొరబాబు కూటమి నాయకులు పాల్గొన్నారు. సందడిగా గడుపుతూ ఉత్సవంలో సందడి చేశారు. అనంతరం రథోత్సవం ప్రారంభించారు. కూటమి నేతలంతా ఒకేచోట చేరడంతో సందడి వాతావరణం నెలకొంది.








