విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ పరిధిలో 9 జిల్లాల్లో కొత్త పరిశ్రమలు రాబోతున్నాయని కలెక్టర్ తెలిపారు. విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ లో ఉన్న కాకినాడ జిల్లా పై జిల్లా కలెక్టర్ షణ్మోహన్.. పరిశ్రమ, మున్సిపల్ కార్పొరేషన్, పర్యాటక, ఆర్ అండ్ బి, పశుసంవర్థక, మత్స్య, వైద్య ఆరోగ్యం, ఉద్యాన, జాతీయ రహదారులు తదితర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ వర్టికల్స్ ప్రాజెక్టులో భాగంగా విశాఖపట్నం, చుట్టుపక్కల ఉన్న 9 జిల్లాలతో విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కాకినాడ జిల్లా పరిధిలో చేపట్టబోయే నూతన ప్రాజెక్టులకు సంబంధించిన ప్రతిపాదనలు రూపొందించాలని ఆయన అధికారులను ఆదేశించారు.










