కాకినాడ జిల్లా సామర్లకోట మండలం ఉండూరు రోడ్డులో యార్లగడ్డ వెంకట సుబ్బారావు మెమోరియల్ శ్రీ కుమార రామ భీమేశ్వర ఎడ్ల పరుగు ప్రదర్శన పోటీలు హోరాహోరీగా జరిగాయి. ఈ పోటీల్లో సీనియర్స్ విభాగంలో మొదటి బహుమతి కోర తేజ చౌదరి (గుమ్మినేరు), ద్వితీయ బహుమతి కోరా సత్యవేణి(గుమ్మినేరు), తృతీయ బహుమతి వల్లూరి సత్యేంద్ర కుమార్(సామర్లకోట), విజేతలుగా నిలిచారు.
జూనియర్స్ విభాగం నుండి మొదటి బహుమతి కోర సత్యవేణి (గుమ్మినేరు), ద్వితీయ బహుమతి భవిరిశెట్టి మణి (వన్నెపూడి), తృతీయ బహుమతి పండూరి శ్రీను(సామర్లకోట), చతుర్ధి బహుమతి మల్లిరెడ్డి అన్నపూర్ణ (జి.మేడపాడు), పంచమి బహుమతి వేగుళ్ల కృష్ణమాధురి (మండపేట) గెలుపొందారు. పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయలు చినరాజప్ప, డిసిసిబి చైర్మన్ తుమ్మల రామస్వామి (బాబు) బహుమతులు అందజేశారు.








