Search
Close this search box.

  ‘సంక్రాంతికి వస్తున్నాం’ బాలీవుడ్ రీమేక్: మీనాక్షి చౌదరి స్థానంలో రాశీ ఖన్నా!

విక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో సంక్రాంతి కానుకగా విడుదలై, బాక్సాఫీస్ వద్ద రూ. 300 కోట్లకు పైగా వసూళ్లతో సంచలనం సృష్టించిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇప్పుడు బాలీవుడ్‌లో రీమేక్‌కు సిద్ధమవుతోంది. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో అనీస్ బాజ్మీ దర్శకత్వంలో ఈ సినిమాను దిల్ రాజు నిర్మించనున్నారు. ఈ క్రమంలో ఒరిజినల్ వెర్షన్‌లో మీనాక్షి చౌదరి పోషించిన కీలక పాత్రను హిందీలో రాశీ ఖన్నా చేయబోతున్నట్లు లేటెస్ట్ సమాచారం.

ఒరిజినల్ సినిమాలో వెంకటేష్ మాజీ ప్రియురాలిగా మీనాక్షి చౌదరి, భార్యగా ఐశ్వర్యా రాజేష్ నటించారు. అయితే హిందీ రీమేక్‌లో మీనాక్షి చౌదరి పాత్రను రాశీ ఖన్నా పోషిస్తుండగా, ఐశ్వర్యా రాజేష్ పాత్రలో ప్రముఖ నటి విద్యా బాలన్ నటించనున్నట్లు తెలుస్తోంది. తొలుత మీనాక్షి చౌదరినే హిందీలో కూడా తీసుకుంటారని వార్తలు వచ్చినప్పటికీ, బాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితురాలైన రాశీ ఖన్నా వైపు మేకర్స్ మొగ్గు చూపినట్లు సమాచారం. ఈ సినిమాతోనే టాలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండటం విశేషం.

మరోవైపు రాశీ ఖన్నా ప్రస్తుతం వరుస క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంలో ఆమె ఒక ఫోటోగ్రాఫర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాతో పాటు పలు వెబ్ సిరీస్‌లు మరియు హిందీ ప్రాజెక్టులతో ఆమె కెరీర్ దూసుకుపోతోంది. టాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్ అయిన ఈ కథ బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ఇమేజ్‌కు సరిగ్గా సరిపోతుందని, అక్కడ కూడా ఘనవిజయం సాధిస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు