Search
Close this search box.

  హద్దు దాటిన అభిమానం: ‘రాజాసాబ్’ ఈవెంట్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం.. చిన్మయి తీవ్ర ఆగ్రహం!

December 18, 2025 5:13 PM | Aditya369 News

హద్దు దాటిన అభిమానం: ‘రాజాసాబ్’ ఈవెంట్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం.. చిన్మయి తీవ్ర ఆగ్రహం!

ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ది రాజాసాబ్' సినిమా ప్రమోషన్స్ కోసం హైదరాబాద్‌లోని లులు మాల్‌లో ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో నటి నిధి అగర్వాల్‌కు తీవ్ర చేదు అనుభవం ఎదురైంది. 'సహన సహన' సాంగ్ లాంచ్ కోసం వచ్చిన ఆమెను అభిమానులు ఒక్కసారిగా చుట్టుముట్టారు. అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఆమెపై పడిపోవడం, తాకే ప్రయత్నం చేయడంతో నిధి తీవ్ర ఇబ్బందికి గురైంది. సెక్యూరిటీ ఎంత ప్రయత్నించినా అదుపు చేయలేని స్థాయిలో గుంపు దూసుకురావడంతో ఆమె ముఖానికి చేతులు అడ్డుపెట్టుకుంటూ అసహనం వ్యక్తం చేస్తూ కారు ఎక్కింది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు మరియు ప్రముఖులు నిర్వాహకులపై మండిపడుతున్నారు. ముఖ్యంగా సింగర్ చిన్మయి శ్రీపాద ఈ ఘటనపై ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తీవ్రంగా స్పందించారు. "నక్కల కంటే దారుణంగా ప్రవర్తించే మగాళ్ల గుంపు ఇది.. ఒక మహిళను ఇలా వేధించడం ఏంటి?" అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అభిమానం పేరుతో సెలబ్రిటీల వ్యక్తిగత స్వేచ్ఛను హరించడం, వారిని భయాందోళనకు గురిచేయడం సరికాదని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
భారీ అంచనాలున్న 'ది రాజాసాబ్' చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. ఈ చిత్రంలో నిధితో పాటు మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇలాంటి పబ్లిక్ ఈవెంట్స్ నిర్వహించేటప్పుడు మహిళా సెలబ్రిటీల భద్రత కోసం మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, సరైన బారికేడ్లు మరియు పటిష్టమైన సెక్యూరిటీ లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నటి నిధి అగర్వాల్ ఈ పరిణామం పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ది రాజాసాబ్’ సినిమా ప్రమోషన్స్ కోసం హైదరాబాద్‌లోని లులు మాల్‌లో ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో నటి నిధి అగర్వాల్‌కు తీవ్ర చేదు అనుభవం ఎదురైంది. ‘సహన సహన’ సాంగ్ లాంచ్ కోసం వచ్చిన ఆమెను అభిమానులు ఒక్కసారిగా చుట్టుముట్టారు. అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఆమెపై పడిపోవడం, తాకే ప్రయత్నం చేయడంతో నిధి తీవ్ర ఇబ్బందికి గురైంది. సెక్యూరిటీ ఎంత ప్రయత్నించినా అదుపు చేయలేని స్థాయిలో గుంపు దూసుకురావడంతో ఆమె ముఖానికి చేతులు అడ్డుపెట్టుకుంటూ అసహనం వ్యక్తం చేస్తూ కారు ఎక్కింది.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు మరియు ప్రముఖులు నిర్వాహకులపై మండిపడుతున్నారు. ముఖ్యంగా సింగర్ చిన్మయి శ్రీపాద ఈ ఘటనపై ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తీవ్రంగా స్పందించారు. “నక్కల కంటే దారుణంగా ప్రవర్తించే మగాళ్ల గుంపు ఇది.. ఒక మహిళను ఇలా వేధించడం ఏంటి?” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అభిమానం పేరుతో సెలబ్రిటీల వ్యక్తిగత స్వేచ్ఛను హరించడం, వారిని భయాందోళనకు గురిచేయడం సరికాదని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

భారీ అంచనాలున్న ‘ది రాజాసాబ్’ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. ఈ చిత్రంలో నిధితో పాటు మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇలాంటి పబ్లిక్ ఈవెంట్స్ నిర్వహించేటప్పుడు మహిళా సెలబ్రిటీల భద్రత కోసం మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, సరైన బారికేడ్లు మరియు పటిష్టమైన సెక్యూరిటీ లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నటి నిధి అగర్వాల్ ఈ పరిణామం పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు