Search
Close this search box.

  ‘ధురంధర్’ సంచలనం: ‘పుష్ప-2’ రికార్డును బద్దలుకొట్టి ₹300 కోట్లకు పైగా వసూళ్లు

December 13, 2025 5:43 PM | Aditya369 News

‘ధురంధర్’ సంచలనం: ‘పుష్ప-2’ రికార్డును బద్దలుకొట్టి ₹300 కోట్లకు పైగా వసూళ్లు

రణ్‌వీర్ సింగ్ హీరోగా, 'యురి' ఫేమ్ ఆదిత్య ధార్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం 'ధురంధర్' (Dhurandhar Movie) బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. సారా అర్జున్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, మాధవన్ వంటి స్టార్ నటులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలోని పాటలు, సన్నివేశాలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పాటు, ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.
ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతూ, విడుదలైన రెండో శుక్రవారం రోజున ₹34.70 కోట్ల కలెక్షన్లను సాధించి సంచలనం సృష్టించింది. ఈ కలెక్షన్లతో 'ధురంధర్' చిత్రం హిందీలో 'పుష్ప-2' (₹27.50 కోట్లు) నెలకొల్పిన రికార్డును బద్దలు కొట్టింది. రెండో శుక్రవారం రోజు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో 'ధురంధర్' అగ్రస్థానంలో నిలవగా, ఆ తర్వాతి స్థానాల్లో 'ఛావా', 'యానిమల్', 'గదర్-2', హిందీ 'బాహుబలి-2' వంటి సినిమాలు ఉన్నాయి.
ఓవరాల్‌గా ఈ 'ధురంధర్' చిత్రం ప్రపంచవ్యాప్తంగా ₹300 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించినట్లు నేషనల్ మీడియా వెల్లడించింది. స్టార్ కాస్టింగ్, అద్భుతమైన సన్నివేశాలు, పాటలు కలగలిపి ఈ సినిమాకి ఇంతటి భారీ విజయాన్ని, కలెక్షన్లను తెచ్చిపెట్టాయి. ఈ చిత్రం సాధించిన ఘన విజయం బాలీవుడ్ బాక్సాఫీస్‌పై రణ్‌వీర్ సింగ్ స్థాయిని పెంచింది.

రణ్‌వీర్ సింగ్ హీరోగా, ‘యురి’ ఫేమ్ ఆదిత్య ధార్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘ధురంధర్’ (Dhurandhar Movie) బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. సారా అర్జున్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, మాధవన్ వంటి స్టార్ నటులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలోని పాటలు, సన్నివేశాలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పాటు, ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతూ, విడుదలైన రెండో శుక్రవారం రోజున ₹34.70 కోట్ల కలెక్షన్లను సాధించి సంచలనం సృష్టించింది. ఈ కలెక్షన్లతో ‘ధురంధర్’ చిత్రం హిందీలో ‘పుష్ప-2’ (₹27.50 కోట్లు) నెలకొల్పిన రికార్డును బద్దలు కొట్టింది. రెండో శుక్రవారం రోజు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో ‘ధురంధర్’ అగ్రస్థానంలో నిలవగా, ఆ తర్వాతి స్థానాల్లో ‘ఛావా’, ‘యానిమల్’, ‘గదర్-2’, హిందీ ‘బాహుబలి-2’ వంటి సినిమాలు ఉన్నాయి.

ఓవరాల్‌గా ఈ ‘ధురంధర్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ₹300 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించినట్లు నేషనల్ మీడియా వెల్లడించింది. స్టార్ కాస్టింగ్, అద్భుతమైన సన్నివేశాలు, పాటలు కలగలిపి ఈ సినిమాకి ఇంతటి భారీ విజయాన్ని, కలెక్షన్లను తెచ్చిపెట్టాయి. ఈ చిత్రం సాధించిన ఘన విజయం బాలీవుడ్ బాక్సాఫీస్‌పై రణ్‌వీర్ సింగ్ స్థాయిని పెంచింది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు