Search
Close this search box.

  విశ్వంభర రిలీజ్ డేట్ లాక్..? ఎప్పుడంటే..?

October 6, 2026 9:45 PM | Aditya369 News

విశ్వంభర రిలీజ్ డేట్ లాక్..? ఎప్పుడంటే..?

మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఎప్పటినుంచో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘విశ్వంభర’. షూటింగ్ ఎప్పుడో పూర్తయినప్పటికీ.. గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ పనుల కారణంగా ఈ సినిమా విడుదల మాత్రం పదేపదే వాయిదా పడుతూ వస్తోంది.

దీంతో ‘విశ్వంభర’ అసలు ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందనే విషయంలో అభిమానుల్లో రోజురోజుకూ ఆసక్తి పెరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమా నవంబర్‌లో వస్తుందని, ఆ తర్వాత సంక్రాంతి బరిలోకి దిగుతుందని రకరకాల వార్తలు వినిపించాయి.

అయితే ఇప్పుడు మరో కొత్త రిలీజ్ డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘విశ్వంభర’ను 2027 మార్చిలో మహాశివరాత్రి సందర్భంగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

ఫాంటసీ, డివైన్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కుతున్న సినిమా కావడంతో మహాశివరాత్రి సీజన్ ఈ మూవీకి మరింత ప్లస్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ రిలీజ్ డేట్‌పై ఇప్పటివరకు అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.

మరోవైపు చిరంజీవి ప్రస్తుతం బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కాకా’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా 2027 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. దీంతో ‘కాకా’ విడుదల తర్వాతే ‘విశ్వంభర’ థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది.

ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ‘విశ్వంభర’ తర్వాత చిరంజీవి నటించిన మరో సినిమా ‘మన శంకర వరప్రసాద్ గారు’ కూడా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఆ సినిమా సక్సెస్ తర్వాత ‘విశ్వంభర’కు మంచి మార్కెట్ ఏర్పడుతుందని భావించినప్పటికీ.. ఈ సినిమా మాత్రం ఇంకా ప్రేక్షకుల ముందుకు రాలేదు.

ఇప్పటికే ఎన్నోసార్లు రిలీజ్ డేట్‌పై వార్తలు రావడంతో మెగా అభిమానులు మాత్రం ఈసారి అయినా విడుదల తేదీ అధికారికంగా లాక్ కావాలని కోరుకుంటున్నారు.

వశిష్ట మల్లిడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సోషియో ఫాంటసీ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై విక్రమ్ రెడ్డి, వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మిస్తున్నారు. చిరంజీవి సరసన త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది.

మరి 2027 మహాశివరాత్రి రిలీజ్ డేట్ నిజంగానే ఫిక్స్ అవుతుందా? లేక ‘విశ్వంభర’కు మరోసారి వాయిదా తప్పదా? అన్నది అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు