Search
Close this search box.

  తిలక్ వర్మకు చిరంజీవి బిగ్ సర్ప్రైజ్: ఆసియా కప్ ఇన్నింగ్స్ ఫ్రేమ్‌తో ‘మన శంకర వర ప్రసాద్’ సెట్స్‌లో యువ క్రికెటర్‌కు మెగాస్టార్ సన్మానం

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఈ చిత్రీకరణలో బిజీగా ఉన్నప్పటికీ, చిరంజీవి ఒక ప్రత్యేక సందర్భానికి సమయం కేటాయించారు. ఇటీవల ఆసియా కప్ ఫైనల్లో పాకిస్థాన్‌పై భారత్ ఘనవిజయం సాధించడంలో కీలకపాత్ర పోషించిన యువ క్రికెటర్ తిలక్ వర్మను మెగాస్టార్ సెట్స్‌కి ఆహ్వానించి సన్మానించారు. ఒత్తిడిలోనూ ప్రశాంతంగా ఆడుతూ, అద్భుతమైన ఇన్నింగ్స్‌తో భారత్ విజయంలో భాగస్వామి అయిన తిలక్ వర్మ ప్రతిభను చిరంజీవి ప్రత్యేకంగా అభినందించారు.

తన సహజమైన వినయం, పెద్ద మనసుతో చిరంజీవి, తిలక్ వర్మను ఆప్యాయంగా ఆహ్వానించారు. ఆయనకు శాలువా కప్పి, మ్యాచ్‌లోని ఆయన మెమొరబుల్ మూమెంట్ ని ఫ్రేమ్ చేసిన ఫోటోను జ్ఞాపికగా అందజేశారు. కృషి, క్రమశిక్షణ కేవలం క్రీడలోనే కాకుండా జీవితంలోనూ విజయానికి మార్గదర్శకమని తిలక్ వర్మకు చిరంజీవి సూచించారు.

ఈ కార్యక్రమంలో హీరోయిన్ నయనతార, దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాతలు సాహు గరపాటి, సుస్మిత కొణిదెల కూడా పాల్గొన్నారు. వారు కూడా యువ క్రికెటర్ తిలక్ వర్మను ప్రశంసించారు. ఇండియన్ సినిమా ఐకాన్ చిరంజీవి చేత సన్మానం పొందడం తిలక్ వర్మకు ఒక ప్రత్యేక క్షణంగా నిలిచింది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు