టాలీవుడ్‌లో దిగ్గజ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి, ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి గ్లోబల్ స్థాయిలో ఓ భారీ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం వర్కింగ్ టైటిల్ “SSMB29” పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది.
అప్డేట్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్
ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఒక పోస్టర్ మాత్రమే రిలీజ్ చేయగా, అప్పటినుంచి ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఏడాది నవంబరులో ఓ మెగా అప్డేట్ వస్తుందని రాజమౌళి హామీ ఇచ్చారు.
రాజమౌళి టార్గెట్.. మహేష్ అయోమయం
రాజమౌళి ఈ చిత్రాన్ని 2027 మార్చి 25న రిలీజ్ చేయాలని ఫిక్స్ చేసినట్లు సమాచారం. అందుకే షూటింగ్‌ను వేగంగా పూర్తి చేయాలని చూస్తున్నారు. కానీ ఫ్యామిలీతో టైమ్ గడపడం ఇష్టపడే మహేష్ బాబు, ఈ కఠినమైన షెడ్యూల్‌పై కొంత అయోమయంలో ఉన్నారని టాక్.
భారీ బడ్జెట్ – రెండు భాగాలు
ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఆమె పాత్రకు సంబంధించిన 70% షూటింగ్ పూర్తయిందట. అలాగే మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలకపాత్రలో కనిపించనున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌పై సుమారు ₹1200 కోట్లు ఖర్చు చేయనున్నారని ఇండస్ట్రీ టాక్.
ఆస్కార్ స్థాయిలో నిలిచేలా రాజమౌళి ప్లాన్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి..









