Search
Close this search box.

  బన్నీ కోసం అట్లీ మాస్టర్ ప్లాన్..! ఎంట్రీ సీన్‌కి మాసివ్ సెటప్..?

పుష్ప సినిమాతో పాన్-ఇండియా హీరోగా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్, ఆ సినిమాతోనే నేషనల్ అవార్డు అందుకుని చరిత్ర సృష్టించారు. తెలుగు నటులలో తొలిసారిగా నేషనల్ అవార్డు గెలుచుకున్న హీరోగా తన పేరును నిలిపారు. ఆ తర్వాత వచ్చిన పుష్ప 2తో మరోసారి ఘన విజయాన్ని అందుకున్నారు.

ఇప్పుడు బన్నీ, కోలీవుడ్ టాప్ డైరెక్టర్ అట్లీతో కలిసి ఒక భారీ చిత్రంలో నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు

ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే మొదలైంది. తాజాగా బయటకు వచ్చిన అప్డేట్ అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది. అల్లు అర్జున్ ఎంట్రీ సీన్ కోసం అట్లీ ప్రత్యేకంగా మాసివ్ సెటప్ వేశాడట. ఈ సీక్వెన్స్‌లో 300 మందికి పైగా ఆర్టిస్టులు పాల్గొంటున్నారని సమాచారం. బన్నీ ఎంట్రీని గూస్‌బంప్స్ రప్పించేలా చిత్రీకరిస్తున్నాడని తెలిసింది.

హీరోయిన్ విషయంలో మొదట ప్రియాంక చోప్రా పేరు వినిపించినా, ఆ స్థానంలో చివరికి దీపికా పడుకొనే ఫైనల్ అయ్యారు. ఇక ఈ సినిమాలో మొత్తం ఐదు హీరోయిన్లు నటించబోతున్నారన్న టాక్ వినిపిస్తోంది. రష్మిక మందన్న విలన్ రోల్‌లో కనిపించబోతుందనే వార్త బజ్‌గా మారింది. జాన్వీ కపూర్ కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారని తెలుస్తోంద

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు