విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూసిన కొద్ది రోజుల్లోనే ఆయన భార్య రుక్మిణి తుదిశ్వాస విడిచారు. రుక్మిణి చాలా కాలంగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. ఇటీవల భర్త కోట శ్రీనివాసరావు మృతి ఆమెను బాగా కుంగదీసింది. దీంతో మరింత బెంగగా ఆమె పరిస్థితి నెలకొంది.ఈ పరిస్థితుల్లో ఆమె మృత్యువాత పడ్డారని బంధువులు చెబుతున్నారు. రుక్మిణీ గతంలో ఆమె ప్రసవ సమయంలో తల్లి మరణించడంతో షాక్ గురై చాలా కాలం ఎవరినీ గుర్తు పట్టలేనంతగా మారిపోయింది. ఈవిషయాన్ని గతంలో కోట శ్రీనివాసరావు ఓ ఇంటర్వ్యూ సందర్భంగా తెలిపారు. కోట కుమారుడు ఆంజనేయ ప్రసాద్ గతంలో రోడ్డు ప్రమాదంతో మృతిచెందడంతో అప్పటి నుండి ఆ దంపతులు కోలుకోలేని విధంగా దెబ్బతిన్నారు.
