Search
Close this search box.

  భార‌త్ ఉప‌రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా రాధాకృష్ణ‌న్‌

భార‌త్ ఉప రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా ప్ర‌స్తుత మ‌హారాష్ట్ర గ‌వ‌ర్న‌ర్‌గా ఉన్న సీపీ రాధాకృష్ణ‌న్‌ను ఎన్డీయే ప్ర‌క‌టించింది.జ‌గ్‌ధీప్ ధ‌న‌ఖ‌డ్ ఉప రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వికి రాజీనామా చేసిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న స్థానంలో ఉప రాష్ట్ర‌ప‌తిగా ఎవ‌రుంటార‌నే దానిపై ప‌లు పేర్లు తెర‌పైకి వ‌చ్చాయి. అయితే అనూహ్యంగా ఎన్డీయే సీపీ రాధాకృష్ణ‌న్‌ను ఉప రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించింది. సెప్టెంబ‌ర్ 9న ఉప రాష్ట్ర‌ప‌తి ఎన్నిక జ‌ర‌గ‌నుంది. ఈనెల 22తో నామినేష‌న్ల గ‌డువు పూర్తికానుంది. ఈనేప‌థ్యంలో రాధాకృష్ణ‌న్‌కు ఎన్డీయే అవ‌కాశం క‌ల్పించింది. ఈమేర‌కు ఆదివారం బీజేపీ పార్ల‌మెంట‌రీ బోర్డు స‌మావేశంలో రాధ‌కృష్ణ‌న్ పేరును అధికారికంగా ప్ర‌క‌టించింది. బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా, హోంమంత్రి అమిత్‌షా, పార్టీ అగ్ర‌నేత‌ల స‌మ‌క్షంలో ఎన్డీయే పేరును ప్ర‌క‌టించింది. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కూ తెర‌పైకి వ‌చ్చిన ఉహాగానాల‌కు తెర‌ప‌డింది. రాధాకృష్ణ గ‌తంలో తెలంగాణా, జార్కండ్ రాష్ట్రాల‌కు గ‌వ‌ర్న‌ర్‌గా ప‌నిచేశారు. కొయ్యంబ‌త్తూరు ఎంపీగా కూడా ప‌నిచేసిన అనుభ‌వం ఉంది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు