వైవిధ్యభరితమైన కథలు, నాణ్యమైన నిర్మాణ విలువలతో టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఇప్పుడు మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టింది. ‘కాంతార’ సినిమాతో దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అబ్బురపరిచిన నటుడు-దర్శకుడు రిషబ్ శెట్టితో కలిసి భారీ హిస్టారికల్ యాక్షన్ డ్రామాను నిర్మించనున్నట్టు సంస్థ అధికారికంగా ప్రకటించింది.
ప్రస్తుతం ‘కాంతార 2’ పనుల్లో ఉన్న రిషబ్ శెట్టి, ఈ కొత్త చిత్రంలో 18వ శతాబ్దం నాటి భారతదేశంలోని అల్లకల్లోలంగా ఉన్న బెంగాల్ ప్రావిన్స్ నేపథ్యంలో ఒక తిరుగుబాటుదారుడి కథను ఆధారంగా తీసుకుని నటించనున్నారు. ఇది పూర్తిగా ఫిక్షనల్ హిస్టారికల్ యాక్షన్ డ్రామా, దేశభక్తితో కూడిన గాథగా రూపుదిద్దుకోనుంది.
ఈ ప్రాజెక్ట్‌కు దర్శకత్వం వహించనున్న అశ్విన్ గంగరాజు కు ఇప్పటికే స్ర్కిప్ట్ రైటర్‌గానూ, దర్శకుడిగానూ మంచి గుర్తింపు ఉంది. ఈ చిత్రంతో ఆయన మరో విభిన్నమైన ప్రయోగానికి సిద్ధమయ్యారు..ఈ సినిమా తెలుగు, కన్నడ భాషలలో ఏకకాలంలో తెరకెక్కించబడి, తమిళం, హిందీ, మలయాళం భాషలలోనూ విడుదల కానుంది..ప్రొడక్షన్ నెం. 36గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ మరియు సాయి సౌజన్య నిర్మించనున్నారు..ఈ చిత్రానికి ప్రముఖ నటీనటులు, టెక్నిషియన్స్ పని చేయనుండగా, ఇప్పుడే ప్రకటన వచ్చినా… సినిమాపై క్రేజ్ ఆకాశాన్ని తాకుతోంది. భారతీయ సినిమా ప్రేమికులందరిలోనూ ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. త్వరలో మరిన్ని వివరాలను నిర్మాతలు ప్రకటించనున్నారు.