విజయ్ దేవరకొండ నటించిన మోస్ట్ అవైటెడ్ యాక్షన్ డ్రామా “కింగ్‌డమ్” నేడు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. విడుదలకు ముందే సినిమాపై భారీ అంచనాలు ఏర్పడగా, ప్రమోషన్స్‌లో భాగంగా విజయ్ తాజాగా మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
సినిమా ట్రైలర్ చివర్లో ఓ ప్రత్యేకమైన వ్యక్తి కాంతారలో రిషబ్ శెట్టి లుక్స్‌లో కనిపించిన సీన్పై ఇప్పుడు ప్రేక్షకుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఆ వ్యక్తి ఎవరు? ఆయనేనా మరో స్టార్ హీరో? అన్న ప్రశ్నలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఈ విషయంపై మీడియా విజయ్‌ను నేరుగా ప్రశ్నించగా,
“ఆ విషయం మీరు సినిమాలో చూస్తేనే బెటర్. కానీ, అవును… మీరు అనుకున్నట్టుగానే – ఓ స్టార్ హీరో!” అని ఆసక్తి పెంచే సమాధానం ఇచ్చాడు.
దీంతో ఈ మిస్టీరియస్ క్యారెక్టర్ ఎవరో తెలుసుకునేందుకు ప్రేక్షకులు థియేటర్‌కి వెళ్లేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో, సినిమాలో సీక్వెల్ ఉండబోతోందన్న ఊహాగానాలు కూడా చక్కర్లు కొడుతున్నాయి.
ఇప్పటి వరకు విజయ్ దేవరకొండ చేయని విధంగా రూపొందిన ఈ చిత్రం యాక్షన్, ఎమోషన్, కంటెంట్ పరంగా కొత్తగా అనిపిస్తోంది. ట్రైలర్ విడుదల తర్వాత అన్ని అనుమానాలు తొలగిపోయాయి. ఇక అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో కూడా “కింగ్‌డమ్” మంచి రెస్పాన్స్ సాధిస్తూ బాక్సాఫీస్ వద్ద హైప్‌ను కొనసాగిస్తోంది.