పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, శ్రీలీల, రాశిఖన్నా హీరోయిన్స్‌గా, హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మోస్ట్ అవైటెడ్ మాస్ ఎంటర్టైనర్ “ఉస్తాద్ భగత్ సింగ్” చిత్రీకరణ వేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే క్లైమాక్స్ పార్ట్ పూర్తయ్యింది. ఇప్పుడు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లే ఓ స్పెషల్ సాంగ్ షూటింగ్ జోరుగా సాగుతోంది..ఈ పాట గురించి టాలీవుడ్ లో హాట్ టాక్ నడుస్తోంది. పవన్ కళ్యాణ్ కెరీర్‌లో ఇది ఒక మైలురాయి సాంగ్ కానుందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మాస్ మరియు సెలబ్రేషన్ వాతావరణాన్ని మెరిపించేలా, దేవి శ్రీ ప్రసాద్ ఈ పాటకు సంగీతం అందించగా, “వాతి కమింగ్”, “ఆలుమా డోలుమా” స్థాయిలో ఉండేలా స్టైలిష్ కంపోజిషన్ చేసినట్టు సమాచారం.
పవన్ ప్రత్యేకంగా వేసిన స్టెప్పులు ఈ సాంగ్ హైలైట్ కానున్నాయి. థియేటర్లలో పండగ వాతావరణాన్ని తీసుకొచ్చేలా మేకర్స్ పెద్ద స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు..మొత్తానికి, ఈ స్పెషల్ నంబర్‌పై భారీ హైప్ క్రియేట్ అవుతుండగా… అభిమానులకి ఈ మాస్ బ్లాస్ట్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అన్న అంచనాలు మొదలయ్యాయి..