పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరో భారీ ప్రాజెక్ట్‌తో తెరపైకి రానున్నారు. ‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’, ‘యానిమల్’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాల దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందనున్న ఈ కొత్త చిత్రం పేరు ‘స్పిరిట్’.ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడిగా ‘యానిమల్’ మూవీతో ఆకట్టుకున్న ముద్దుగుమ్మ త్రిప్తి దిమ్రి నటించనున్నారు. ఇదే ఆమెకు ప్రభాస్‌తో తొలి సినిమా కావడం విశేషం. ఈ జంట మీద అభిమానుల్లో ఇప్పటికే మంచి ఆసక్తి నెలకొంది.ఈ భారీ బడ్జెట్ పాన్ వరల్డ్ మూవీలో రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ చివర్లో ప్రారంభమవనుందని మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. ఈ సినిమా తొమ్మిది భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది..హై స్టాండర్డ్స్, యూనివర్సల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కే ఈ మూవీకి గ్లోబల్ ఆడియెన్స్‌ను టార్గెట్ చేస్తున్నారు. ప్రభాస్ మాస్, క్లాస్ అందర్నీ ఆకట్టుకునే పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం..ఈ చిత్రాన్ని భద్రకాళి పిక్చర్స్ ప్రొడక్షన్స్, టి-సిరీస్ ఫిల్మ్స్ బ్యానర్లపై ప్రణయ్ రెడ్డి వంగా, భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్ కలిసి నిర్మిస్తున్నారు..
