టాలీవుడ్లో ప్రస్తుతం హాట్ టాపిక్ ఏదైనా ఉందంటే అది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కొత్త ప్రాజెక్ట్ గురించిందే..రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది సినిమా చేస్తున్న విషయం తెలిసిందే..ఈ సినిమా దాదాపు 40% షూటింగ్ పూర్తి అయింది.. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ చేయబోయే సినిమా పై ఇప్పుడు సోషల్ మీడియాలో న్యూస్ తెగ వైరల్ అవుతుంది.. రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయబోతున్నట్లు న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది.. ప్రొడ్యూసర్ నాగవంశీ త్రివిక్రమ్ చేయబోయే సినిమాల పై క్లారిటీ ఇవ్వడంతో రామ్ చరణ్ త్రివికమ్ సినిమా వట్టి రూమర్ అని తేలింది.. దీంతో రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా డైరెక్టర్ సుకుమార్ తో కన్ఫర్మ్ అని తెలుస్తుంది.. అయితే సుకుమార్ సినిమా తర్వాత రామ్ చరణ్ క్రేజీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తో సినిమా చేయబోతున్నట్లు రూమర్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఇప్పటికే సందీప్ రెడ్డి వంగా రామ్ చరణ్ కు స్టోరీ చెప్పినట్లు సమాచారం.. రామ్ చరణ్ సందీప్ తో సినిమా చేయడానికి ఒకే చెప్పినట్టు ఫిల్మ్ సర్కిల్లో టాక్.. అయితే ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ & భద్రకాళి ప్రొడక్షన్స్ కలిసి నిర్మించబోతున్నట్లు సమాచారం..ఈ సినిమా గ్యాంగ్ స్టార్ బ్యాక్ డ్రాప్ కథతో రాబోతున్నట్లు సమాచారం.. ఈ కాంబో కోసం రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఎదురుచూస్తాన్నారు.. ప్రస్తుతం సందీప్ ప్రభాస్ స్పిరిట్ తో బిజీగా ఉన్నాడు.. ఈ సినిమా తర్వాత అనిమల్ పార్క్ కంప్లీట్ చేసి అప్పుడు రామ్ చరణ్ సినిమా పై ఫోకస్ చేస్తాడు అని సమాచారం..అభిమానులు తో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ క్రమంలో, రామ్ చరణ్ – సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో ఓ భారీ సినిమా రానుందని వార్తలు గుప్పుమంటున్నాయి..
