త్రివిక్రమ్ శ్రీనివాస్ ‘గుంటూరు కారం’ తర్వాత ఇంకా కొత్త సినిమా మొదలుపెట్టలేదు. మొదట అల్లు అర్జున్తో ఒక భారీ సోషియో ఫాంటసీ చిత్రం చేయాలనుకున్నారు. స్క్రిప్ట్ సిద్ధం చేసుకుని ప్రీ ప్రొడక్షన్ కూడా మొదలుపెట్టారు. కానీ, అల్లు అర్జున్ ప్రస్తుతం కోలీవుడ్ దర్శకుడు అట్లీతో సినిమా చేయడానికి ముందుకు వెళ్లాడు..ఈ పరిస్థితిలో, త్రివిక్రమ్ అదే కథను జూనియర్ ఎన్టీఆర్తో తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. నిర్మాత నాగ వంశీ తాజాగా సోషల్ మీడియాలో “God of War is Coming” అంటూ ఓ సంస్కృత శ్లోకం షేర్ చేయడంతో, అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. “అత్యంత శక్తివంతమైన దేవతల్లో నాకు అత్యంత ఇష్టమైన దేవుడు…” అంటూ ఉన్న ఆ పోస్టులో ఎన్టీఆర్ కార్తికేయుడిగా నటించనున్నట్టు అర్థమవుతోంది.ఇతర ప్రాజెక్ట్స్ పూర్తి చేసిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కూడా ఖాళీగా ఉన్నారు. ‘వార్ 2’ తర్వాత ఆయన కొత్త సినిమా ప్రకటించలేదు..ఇదే సమయంలో త్రివిక్రమ్ కూడా కొత్త ప్రాజెక్ట్ కోసం సిద్ధంగా ఉన్నారు. అందుకే ఈ ఇద్దరి కలయికలో మైథలాజికల్ టచ్ ఉన్న సోషియో-ఫాంటసీ ప్రాజెక్ట్ త్వరలో ప్రారంభం కానుంది.. ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతున్నట్లు సమాచారం.. ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ పై రాని ఓ కొత్త మైథాలజీ కథతో రాబోతున్నట్లు సమాచారం.. ఈ సినిమాతో త్రివిక్రమ్ పాన్ ఇండియా లోకి ఎంట్రీ అవ్వబోతున్నాడు.. అలాగే ఈ సినిమాలో భారీ విఎఫ్ఎక్స్ ఉండబోతున్నట్లు సమాచారం.. ఇంతవరకూ త్రివిక్రమ్ భారీ విఎఫ్ఎక్స్ సినిమాలు ఎప్పుడూ చేయలేదు.. చూడాలి మరి ఈసారి త్రివిక్రమ్ ఎన్టీఆర్ ను ఏ రేంజ్ లో చూపిస్టాడో..